¡Sorpréndeme!

లక్ష్మీ పార్వతి పై కేతిరెడ్డి సంచలన కామెంట్స్ ! | Filmibeat Telugu

2017-12-12 1 Dailymotion

Lakshmi's Veeragrandham director Kethireddy Jagadishwar Reddy lambasted NTR's wife Lakshmi Parvathi on her recent comments.

'లక్ష్మీస్ వీరగ్రంధం' సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తాజాగా చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మీ పార్వతి మీద సంచలన కామెంట్స్ చేశారు.
జయం మూవీస్ పతాకంపై ‘లక్ష్మీస్ వీరగ్రంధం' అనే సినిమా నవంబర్ 12న రామారావుగారి సమాధి వద్ద మొదలు పెట్టాము. ఆ తర్వాత కూడా రెండ్రోజులు నిమ్మకూరు, తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాము. రామారావుగారి జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టం ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఆయన జీవితంలోకి లక్ష్మీ పార్వతిగారి ప్రవేశం ఎలా జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? సన్యాసి జీవితం కోరుకున్న అన్నగారు దాంపత్య జీవితం వైపు ఎలా ఆకర్షితులయ్యారు అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సినిమా ఉంటుంది అని కేతిరెడ్డి తెలిపారు.
నేను సినిమా ప్రారంభించిన 12వ తేదీ తర్వాత లక్ష్మి పార్వతి 14వ తేదీన రామారావుగారి సమాధి వద్దకు వెళ్లి ఆ ప్రాంతం అపవిత్రం అయిందని పాలతో అభిషేకం చేశాను అని చెప్పారు. నాకు అన్నగారి పట్ల ఉన్న ప్రేమ, ఆయన ఆదేశంతో తీస్తున్న చిత్రం ఇది. వారిని నేను చాలా వరకు ఎంతో గౌరవంగా మాట్లాడటం జరుగుతోంది. కానీ ఆమె మాత్రం ఒక బజారు వ్యక్తిలాగా, ఒక రోడ్ సైడ్ మాట్లాడే వారిలా నన్ను బజారోడు, రౌడీ, వెధవ, నా అంతు చూస్తాను అని కామెంట్స్ చేసింది.... అని కేతిరెడ్డి తెలిపారు.